విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ని దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కైపు వెంకటకృష్ణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.
తాజా రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలు, కొనసాగుతున్న కార్యాచరణ, భవిష్యత్తు ప్రణాళికలు తదితర విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.
ఈ భేటీలో షర్మిలా రెడ్డి కీలక సూచనలు అందించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యలపై గళం విప్పాలని, కాంగ్రెస్ పార్టీని మరింత బలపర్చే దిశగా కృషి చేయాలని కైపు వెంకటకృష్ణా రెడ్డి కి సూచించారు.
