డిజిటల్ అరెస్ట్ పేరిట జరిగే సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని, ఫ్రాడ్ కాల్ స్కామ్ ల ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నేరగాళ్లు ముందుగా ఆన్లైన్ ద్వారా మీ ఫోన్ నెంబరు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని వివిధ మార్గాల ద్వారా సేకరించి, మీ పేరు, చిరునామా , ఆధార్ నెంబర్ తో మీ పిల్లలు/భర్త/కుటుంబ సభ్యులు తప్పు చేసి మా ఆధీనంలో ఉన్నారని లేదా మీ పాత అకౌంట్ లోన్స్ లో మోసం జరిగిందని, బ్లూ ఫిల్మ్స్ చూస్తున్నారని, మీ పేరుతో ఉన్న సిమ్ కార్డుతో మరొక వ్యక్తి నేరాలు చేశారని, సిబిఐ, ఈడి, కస్టమ్, ఏసీబీ అధికారుల్లా వాయిస్/వీడియో కాల్ చేసి అసలు అధికారుల్లా ప్రవర్తిస్తూ మీతో మాట్లాడుతారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అచ్చం పోలీస్ ఇతర గవర్నమెంట్ అధికారులా మాదిరి పోలీస్ డిపార్టుమెంటు లోగోస్ కనపడేలా, సెట్టింగ్ వేసిన పోలీస్ స్టేషను మరియు కోర్ట్ ల నుండి పోలీస్ యూనిఫామ్, కోర్టు జడ్జి డ్రెస్ లో కనిపిస్తూ మీతో మాట్లాడి, ఇంటరాగేషన్ చేస్తున్నట్లుగా నటిస్తూ, ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి భయపెడుతూ, మీ బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేస్తామని, ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకొచ్చామని చెప్పి నకిలీ లెటర్ చూపిస్తూ మీ అకౌంట్ లో ఉన్న డబ్బుని పోలీస్ డిపార్టుమెంటు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలంటూ అకౌంట్ వివరాలు చెప్తారని, నేరం చేయలేదని రుజువు అయ్యాక.. ఆ డబ్బును తిరిగి మీకు ట్రాన్స్‌ఫర్ చేస్తామని నమ్మించి సైబర్ మోసగాళ్లు మీ అకౌంట్ల నుండి లక్షల్లో కాజేస్తారన్నారు.

కావున ప్రజలు అలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు గాని, సీబీఐ, కస్టమ్స్, విజిలెన్స్, ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని మొదలగు సెంట్రల్ ఏజెన్సీస్ వారి పేరిట కాల్ చేసి భయపెట్టి, డబ్బులు ట్రాన్సఫర్ చేయమన్నా లేక బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ , బ్యాంకు కార్డ్స్ డీటెయిల్స్ , ఓ. టి. పి మరియు ఇతర వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సూచించారు.

ఎవరూ లోకల్ పోలీసులను సంప్రదించకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయరని, అలా మీకు తెలియని వాళ్ళ నుండి అనుమానాస్పదంగా వీడియో కాల్స్ వస్తే కాల్ లిఫ్ట్ చేయకపోవడమే ఉత్తమమని, ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి లేదా హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చెయ్యాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *