పొదుపు మహిళళు ఆర్థికంగా వృద్ధిచెందేందుకు యూనియన్ బ్యాంక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రుణాలు అందించి తోడ్పాటు నందిస్తుందని ఒంగోలు యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ షాహిల్ తెలిపారు. తాళ్లూరు లోని వెలుగు కార్యాలయంలో వెలుగు ఆధ్వర్యం లో విఓఏలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మాట్ల డుతూ తూర్పుగంగవరం యూనియన్ బ్యాంక్ పరిధిలో 150గ్రూపులకు ఎస్ హెచ్ జి రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. కేవలం 30 గూపులకు చెందిన డాక్యుమెంటేషన్ మాత్రమే వెలుగు సిబ్బంది సిద్ధం చేశారని, మిగిలిన 120 గ్రూపుల డాక్యుమెంటేషన్
ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలన్నారు. యూనియన్ బ్యాంక్ తక్కువ వడ్డీకే పొదుపు మహిళలకు రుణాలు ఇస్తుందని, సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా వృద్ధిచెందాలన్నారు. పొదుపు మహిళలు తమ బంధువులకు వ్యాపారరీత్యా అవసరాలు వుంటే రూ50లక్షల మేర రుణాలు యూనియన్ బ్యాంక్ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. రుణాలుతీసుకున్న పొదుపుమహిళలు సకాలం లో రుణాలుచెల్లించాలన్నారు. తూర్పుగంగవరం యూనియన్ బ్యాంక్ మేనేజర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ బ్యాంక్ ద్వారా పొదుపు మహిళలకు వచ్చే నెల మొదటి వారంలో రూ. 2కోట్ల ఎస్ హెచ్ జి
రుణాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని,
డాక్యుమెంటేషన్
చేసి త్వరగా బ్యాంక్ లో సమర్పించాలన్నారు. ఈకార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎం.సుజాత, ఏపిఎం పి.దేవరాజ్, సీసీలు మోహన్ రాయ్, కోటేశ్వరరావు, వెలుగు సీవో కుమారి, వి ఓఏలు పాల్గొన్నారు.
