ఒంగోలు రైల్‌హెడ్‌లో పి. పి. ఎల్ సంస్థ అమ్మోనియం సల్ఫేట్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
పారాదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ (పి. పి. ఎల్ ) సంస్థ వారి ప్రముఖ ఉత్పత్తి అమ్మోనియం సల్ఫేట్‌ను ఆంధ్రప్రదేశ్ రైతులకు వేగంగా, సులభంగా అందించేందుకు ఒంగోలు రైల్‌హెడ్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైల్వే వాగన్ల ద్వారా భారీగా వచ్చిన అమ్మోనియం సల్ఫేట్ నిల్వలను అధికారికంగా ఆవిష్కరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ రైతులకు సమర్థవంతమైన, నాణ్యమైన పోషక ఎరువులు అందించడం పిపిఎల్ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. పంటల పెరుగుదల, పచ్చదనం, దిగుబడుల పెంపుకు కీలకమైన నత్రజని , మరియు గంధకం సమృద్ధిగా లభించే అమ్మోనియం సల్ఫేట్ రైతులకు అత్యంత ప్రయోజనకరమని వివరించారు.
రైతులకు ఎరువుల సకాల సరఫరా కోసం పారాదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ నిరంతరం కృషి చేస్తోందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రైల్ రేకుల ద్వారా లాజిస్టిక్స్‌ను మరింత బలోపేతం చేసినట్లు ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో పారాదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ ఆర్ ఎం ఓ ఎస్ఎండి రఫీ, మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సుభాష్, ఎస్ ఎస్ డి ఓ వినయ్, మార్కెటింగ్ ఆఫీసర్ ప్రభాకర్ ,హోల్‌సేల్ డీలర్లు దేసు వీరయ్య, శీనా రెడ్డి, యక్కల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.



