స్వాతంత్య్ర సమరయోధుడు ఇడమకంటి బ్రహ్మా రెడ్డి తనయుడు, తాళ్లూరు మాజీ
సర్పంచి ఇడమకంటి పెద్ది రెడ్డి (90) శుక్రవారం మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మొదట ఒంగోలులో తర్వాత బెంగుళూరులో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య ఆదిలక్ష్మి, కుమారుడు లక్ష్మి రెడ్డి, కుమార్తె ఉన్నారు. కుమారుడు బెంగుళూరులో విద్యావెత్తగా, వ్యాపార వెత్తగా, సీపీ బ్రౌన్ సేవా నమితి అధ్యక్షుడిగా ఉన్నారు. తాళ్లూరు నర్పంచిగా పెద్ది రెడ్డి 950 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొంది రికార్డు స్వంతం చేసుకున్నారు. మొదట నుండి రాజకీయంగా క్రీయాశీలకంగా ఉన్న కుటుంబం కావటంతో ఆయన అనేక పదవులు చేపట్టారు. డి సిసి ఉపాధ్యక్షుడుడిగా, తాలూకా ఉపాధ్యక్షుడిగా అనంతరం వైఎస్సార్సీపీ లో సైతం పదవులు నిర్వహించారు. నర్పంచిగా తాళ్లూరులో పార్టీలకు అతీతంగా తనదైన ముద్రతో అభివృద్ధి పనులు సాగించారు. ఆయన భార్య ఆదిలక్ష్మి కూడ మన్నేపల్లి సొసైటీ డైరెక్టర్గా పనిచేసారు. పెద, బడుగు, బలహీన వర్గాలకు నిత్యం సహాయ సహకారాలు అందించే కుటుంబంగా మంచి పేరు ఉన్నది. సుంకిరెడ్డి పాలెం గ్రామంలో కూడ డీప్ బోరుతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు, జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన అత్యక్రియలు 22న తాళ్లూరులో నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. తాళ్లూరు పంచాయితీలో నంతాప సూచకంగా స్వామిత్ర గ్రామసభను రద్దు చేసారు.



