మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలోనిలోటుపాట్లను సరిదిద్దాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంచాయతీలందు ఒకేరోజు శనివారం ఉపాధి గ్రామసభలు నిర్వహించాలని ఆదేశాలున్నా తాళ్లూరు మండలంలో తూ..తు మంత్రంగా జరిగాయి రాష్ట్ర పంచాయతీ రాజ్ కమీషనర్ కృష్ణతేజ ఆదేశంతో జిల్లా పీడీ జోసఫ్ కుమార్
ఒకే గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఈకేవైసీ లోటు పాట్లు సవరణలు, అర్హులైన వారికి జాబ్ కార్డ్సవ్ మంజూరు, కూలీలకు పనులు కల్పించేందుకు చర్యలు చేపట్టాని ఉత్తర్వులు జారీ చేశారు. తాళ్లూరు మండలంలోని 16 పంచాయతీలకు గాను నాలుగైదు పంచాయతీలందు మాత్రమే సర్పంచ్ ల ఆద్వర్యంలో గ్రామసభలు జరి గాయి. మిగిలిన గ్రామాల్లో సర్పంచ్ లు, ఉపసర్పంచ్లు ఉపాధిగ్రామ సభలకు దూరంగా వున్నారు. పంచాయతీ కార్యదర్శుల కొరత తీవ్రంగా వుండి నాలుగైదు
పంచాయతీలకు కార్యదర్శులు ఇంచార్జిలుగా వ్యవహరిస్తుండటంతో ఏపంచాయతీలో పాల్గొనాలో అర్ధంకాక మిన్న కుండి పోయాయి. తూర్పుగంగవరం కార్యదర్శి సెలవులో వుండటం, సర్పంచ్, ఉపసర్పంచ్ గ్రామసభకు రాక పోవటంతో ఉపాధి ఏపీవో గ్రామసభ జరిగినట్లు మమా అనిపించారు. తాళ్లూరు, కొర్రపాటివాపాలెం,విఠ
లాపురం పంచాయతీలందు ఉపాది గ్రామ సభలు నిర్వహించ లేదు. జరిగిన గ్రామాల్లో కూడా పట్టుమని 25 మంది గ్రామప్రజలు కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నట్లు తూతూమంత్రంగా ఉపాధి గ్రామ సభలు నిర్వహించారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఉపాధిగ్రామ సభలు జరిగిన గ్రామాల్లో కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం పాల్గొన్నారు.
