సత్య సాయి సేవలు అందరికి స్పూర్తి దాయకమని వక్తలు అన్నారు. తాళ్లూరులో ఆదివారం నత్యసాయి శత జయంతి వేడుకలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. జెడ్పీటీనీ మారం వెంకట రెడ్డి, ఎంపీడీఓ అజిత, తహసీల్దార్ బి వి రమణా రావు, ఎఎస్పై భాస్కర్, ఉపాధ్యాయులు పెద్ది రెడ్డి పాల్గొని సత్యసాయి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజ శ్రేయస్సుకు ఆయన పాటు వడిన విధానంను వివరించారు. ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చని, ఈర్ష్యా ద్వేషాలు విడనాడాలని ఆయన ఇచ్చిన పిలుపు నిత్య నూతనమని అన్నారు.

