రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా భూగర్భగనుల శాఖ నూతన కార్యాలయం ఏర్పాటు మిగిలిన జిల్లాలకు ఒక ఆదర్శంగా నిర్మించనున్నారని మంత్రి కోల్లు రవీంద్ర అన్నారు. ఒంగోలులో భూ గర్భగనుల శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో భూగర్భ గనులు శాఖలో అనేక మంది ఇబ్బందులు పడ్డారని, లాక్కున్న మైన్స్ ను తిరిగి అందించామని అన్నారు. ఇసుక పాలసీ వలన కూడ అనేక ఇబ్బందులు ఎదుర్కోన్నారని అన్నారు. ఇసుక పాలసీ మార్చి ప్రజలకు ఎంతో మేలు చేసారని అన్నారు. అమెరికా తర్వాత వైజాగ్లో గూగుల్ సంస్థ ప్రారంభిస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వం లో . యువ నాయకుడు మంత్రి లోకేష్ సారధ్యంలో రూ.13.50 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని అన్నారు. ప్రకాశం జిల్లాలో రూ.5వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు వస్తున్నట్లు చెప్పారు. సీజరేజ్ను తగ్గించేందుకు పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము. ప్రెండ్లీ ప్రభుత్వం ఇది ఎక్కడైనా ఇబ్బందులు వస్తే పరిష్కరిస్తామమని చెప్పారు. ప్రభుత్వాన్ని దురుద్ధేశ్యంతో నకిలీ మద్యం కేవలం దురుద్దేశ్య పూర్వకంగా జరిగిన ప్రచారమే తప్ప ఎక్కడా నకిలీ మధ్యం లేదు. క్యూ ఆర్ కోడ్ స్కాన్తో మద్యం పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. పరకామణి ఇతర కేసులు వివరాలలో అన్ని బయటకు వస్తాయి. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ
ఉమ్మడి జిల్లాలో గ్రానైట్ కు మంచి పేరు ఉన్నదని , ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయటం అభినందనీయం. అధికారులు అందుబాటులో ఉండేందుకు మంచి కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ భూగర్భ గనులు ద్వారా సంవత్సరానికి ఐదు ఆరు వందల కోట్ల రూపాయాలు ఆదాయం వస్తుందని, దీంతో ఆశాఖకు రూ.2.14 కోట్లకు పైగా నిధులతో కార్యాలయం ఏర్పాటు అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ రావు మాట్లాడుతూ భూగర్భ గనుల శాఖ భవనం మంచి నాణ్యతతో నిర్మించాలని అన్నారు. మైన్స్ను సంబంధించిన అన్ని డిపార్ట్ మెంట్లు ఇక్కడే ఉండే విధంగా ఏర్పాట్లు ఉంటాయని అన్నారు.
కార్యక్రమంలో సంతనూతల పాడు, కనిగిరి ఎమ్మెల్యేలు బి ఎన్ విజయ్కుమార్, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి, జెసీ గోపాల క్రిష్ణ, మారిటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ బుజ్జి, అర్బన్ డవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్, గనుల శాఖ డిడి టిజే రాజశేఖర్, పారిశ్రామిక వెత్తలు శిద్ధా సుధీర్ కుమార్ బధ్రీ నారాయణ, రవి చంద్ర, లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.


