ఎస్సీ పారిశ్రామిక వెత్తలుగా ఎదగాలని ఆశించే యువతీ యువకులను ఈనెల 26న స్పందన హాల్లో జిల్లా షెడ్యూల్ కులముల సహకార సంఘం ఆద్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కార్పోరేషన్ ఈడీ అర్జున్ నాయక్ తెలిపారు. అవగాహన సదస్సు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుందని చెప్పారు. వ్యాపార రంగం, మౌళిక అంశాలు, వ్యాపార వెత్తలుగా మారాలంటే బ్యాంక్ రుణం పొందటం ఎలా, డీపీఆర్ తయారీ విధానం, వివిధ లాభదాయక వ్వాపారాలు, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఎస్సీ కార్పోరేషన్ ద్వారా వారికి తోడ్పాటు వంటి అంశాలపై శిక్షణ ఉంటుందని చెపాపరు. అందుకు సంబంధించిన అవగాహన పోస్టర్
జిల్లా కలెక్టర్ రాజా బాబు సోమవారం అవిష్కరించారు. కార్యక్రమంలో మాల కార్పోరేషన్ చైర్మన్ పి విజయ్ కుమార్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ అర్జున్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
