ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్ మరియు పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాలనుండి వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు స్వీకరించి వారితో మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వర పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.
అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు మరియు ఇతర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజల విశ్వాసం పెంపొందించడమే కాకుండా బాధితులకు తక్షణ సహాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, కనిగిరి సీఐ ఖాజావలి, వై.పాలెం సీఐ కె.అజయ్ కుమార్, పొదిలి సీఐ యం.రాజేష్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

