బేగంపేట నవంబర్ 25(జే ఎస్ డి ఎం న్యూస్) :
సింధ్ కాలనీలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసానని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు.మంగళవారం సింధీ కాలనీలో రోడ్లపై డ్రైనేజ్ నీరు పారుతుందని,తాగు నీరు కలుషిత మవుతుందని స్తానిక కాలనీ వాసులు కోట నీలిమ దృష్టికి తీసుకు రావడంతో మంగళ వారం ఆమె వాటర్ వర్క్స్ శాఖ తదితర శాఖల అధికారులతో కలసి కాలనీలో పర్యటించారు.రోడ్డు పక్కన ఉన్న చెట్లు కొన్ని ఒక వైపుకు వంగిపోయాయని,కొమ్మలు ఇళ్లల్లోకి దూసుకు వస్తున్నాయని,కొమ్మలు కొట్టివేసేలా చూడాలన్నారు.కాలనీ రోడ్డు పైన కొందరు తమ వాహనాలు పార్కింగ్ చేసి వెళుతున్నారని,తాము ఆఫీసు లకు వెళ్ళే సమయంలో చూస్తే తమ గేటు ముందు కూడా కార్లు పార్కింగ్ చేసి ఉంటున్నాయని దీంతో ప్రతి రోజు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఈ సమస్య పరిష్కరించాలని,అలాగే వీధి లైట్లు కూడా సరిగా వెలగడం లేదని కోట నీలిమ దృష్టికి తీసుకు వచ్చారు.సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి కాలనీ లో సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఆయా కాలనీ వాసులతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో బస్తీలు, కాలనీలు నిర్లక్ష్యానికి గురయ్యాయని కోట నీలిమ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరడంతో ఆయన చొరవ చూపించి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. అధికారుల సమన్వయంతో ఆయా ఏరియాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైన చోట్ల నూతన రోడ్ల నిర్మాణం, సీవరేజ్ లైన్‌లు, వీధి దీపాల ఏర్పాటు కోసం వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కోరారు.


