నాగులుప్పలపాడు:
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పురిటిగడ్డ ఈదుమూడి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక సభ్యులు ఇంటూరి రోశయ్య(51) అకాల మరణానికి చింతిస్తున్నామని అతనిమరణం ఉద్యమానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి.మాణిక్య రావు అన్నారు.బుధవారం ఈదుమూడి గ్రామంలో రోశయ్య మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.ఈ గ్రామంలో పుట్టిన ఉద్యమం జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి ఎస్సీ ఉమ్మడి.రిజర్వేషన్ల వర్గీకరణ కావాలని నినాదంతో పోరాటం జరిగిందని ఆ పోరాటంలో తాను కూడా సింహభాగం లో పాల్గొన్నానని ఆయన గుర్తు చేశారు. రోశయ్య ఉద్యమంలో 30 సంవత్సరాలు నిజాయితీగా కష్టపడి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లో క్రియాశీలకంగా పనిచేశారని అతని సేవలు మాదిగ జాతి గర్వించదగిందని మాణిక్యరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర మాదిగ సంక్షేమ పోరాట సమితి అధ్యక్షులు కొమ్ము సుజన్ మాదిగ పాల్గొని రోశయ్య మృతదేహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. అదేవిధంగా ఉద్యమ కాలంలో రోశయ్య తో పాటు, రెండుసార్లు జైలు జీవితం గడిపిన సందర్భాన్నిసుజన్ గుర్తు చేసుకొన్నారు .ఉద్యమ ప్రస్థానంలో ఒక మంచి మిత్రుని కోల్పోవడం చాలా బాధాకరంఅనిఅన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పి ఎస్ ప్రతినిధులు గద్దె త్యాగరాజు,కొలకలూరి విజయ్ కుమార్ ,తేళ్ల జయరాజ్, బండారు సురేష్, తదితరులు పాల్గొన్నారు
