నాగులుప్పలపాడు: ఉప్పుగుండూరు గ్రామంలో 50 పడకల కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాల నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి టి. వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విభాగ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ కమిటీ బృందం బుధవారం ఉప్పుగుండూరులో స్థల పరిశీలన చేశారు. నాగులుప్పలపాడు మండలంలోని సుమారు 15వేల జనాభా కలిగి ఉన్న ఉప్పుగుండూరు గ్రామ మేజర్ పంచాయతీలో ఎక్కువమంది పేదలు నివసించే గ్రామం మరియు ఈ గ్రామం పై సుమారు 20 గ్రామాలు ఆధారపడి ఉండే గ్రామంలో ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల 50 పడకలు అవసరం ఉన్నదని స్థానిక శాసనసభ్యులు బి ఎన్ విజయకుమార్ దృష్టికి ఉప్పుగుండూరు గ్రామ పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు మరియు గ్రామస్తులు తీసుకు వెళ్ళటం జరిగింది. ప్రజలవిజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి శాసనసభ్యులు తీసుకువెళ్లడంతో స్థల పరిశీలన కొరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తో పాటు వైద్య ఆరోగ్య విభాగం ఇన్ఫా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ బృందం స్థల పరిశీలనచేశారు. ఈ సందర్భంగా జిల్లావైద్యఅధికారి టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు మరియు ప్రజల విజ్ఞప్తి మేరకు గ్రామంలో 50 పడకల కమ్యూనిటీ వైద్యశాల నిర్మాణం కొరకు స్థల సేకరణ కోరకు వచ్చామని తెలియజేశారు ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా ప్రజల చిరకాల వాంఛ త్వరలో స్థానిక శాసనసభ్యుల చొరవతో నెరవేరబోతుందన్నారు. నాయకులు,గ్రామస్తులు గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న ఒక ఎకరా 70 సెంట్లు స్థలాన్ని బృందానికి చూపించారు. వీటితోపాటుగా మరో రెండు చోట్ల ప్రభుత్వ స్థలాలను పరిశీలన చేయడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే 50 పడకల కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాల నిర్మాణము త్వరలో జరిగేలా చర్యలు చేపట్టాలని నాయకులు మరియు గ్రామస్తులు జిల్లా వైద్యశాఖ అధికారి కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎంఐడిసి పోతయ్య యాదవ్ సూరిబాబు లతో పాటుగా,గ్రామ టిడిపి పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు సొసైటీ డైరెక్టర్ మసిముక్కు భాస్కరరావు రిటైర్డ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కే.ఎల్. నాగేశ్వరరావు టిడిపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తెలగతోటి జాన్సన్, టిడిపి నాయకులు కనగాల కృష్ణ,ఉప్పుగుండూరు లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, తేలప్రోలు శ్రీరాములు, కోడూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

