తాళ్లూరు -శివరామపురం ప్రధాన రహదారికి గురువారం మోఘా కంపెనీ ఆధ్వర్యంలో
తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు. బెంగుళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేకి పేరాయ పాలెం మట్టి తరలింపులో తాళ్లూరు– వెల్లంపల్లి రోడ్ లో
శివరామపురం వరకు గోతుల మయం అయినది. అనేక సార్లు విన్నవించినా, జిల్లా కలెక్టర్ పరిశీలించి తగిన సూచనలు చేసినా రోడ్డు నిర్మాణ సంస్థ పెడచెవిన పెట్టినది. దీంతో గ్రామంలోని టిడిపి యువ నాయకులు లారీలను అడ్డుకుని మట్టితరలింపు ఆపివేసారు. దీంతో పోలీన్ స్టేషన్ లో
సంస్థ ప్రతినిధులకు, యువకులకు మధ్య రోడ్డు బాగు చేయిస్తామని అంగీకారం కుదిరింది. అందులో బాగంగా గురువారం ప్యాచ్ వర్క్ లు మొదలు పెట్టారు. అయినా సరే నిత్యం రోడ్డుపై వందలాది టర్బో లారీలు తిరుగుతుండటంతో రోడ్లులు గుంతల మయం అవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. హైవే కోసం స్థానికంగా ఉన్న చిన్న పాటి రోడ్లు అన్ని ద్వంసం అవుతున్నాయని అంటున్నారు. కనీసం దుమ్మ లేవకుండా, ఎప్పటికప్పుడు గోతులు పూడుస్తూ కొంత మేర ప్రమాదాల నివారణ రోడ్డు నిర్మాణ సంస్థ సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.

