పంచాయితీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తాళ్లూరు మండల పంచాయితీ
కార్మికులు గురువారం ఎంపీడీఓ అజితకు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కలెక్టర్ నిర్ణయించిన మేరకు రూ. 18వేల వేతనం చెల్లించాలని, హెల్త్ అలవెన్స్ ప్రతి నెల ఇవ్వాలని, బ్లౌజులు, మాస్క్ లు, నబ్లులు, యూనిఫాం, నూనె, చెప్పులు ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి పర్మినెంట్ చెయ్యాలని నాయకుడు పూనూరి రామారావు తదితరులు విన్నవించారు.
