విద్యార్థులు ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారించి తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని
ఎంపీడీఓ అజిత కోరారు. కస్తూరిభా గాంధీ పాఠశాలలో గురువారం విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ అజిత మాట్లాడుతూ చదువు పూర్తి అయిన వెంటనే మైనార్టీలు తీరకుండా కొందరు తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారని అంటువంటి సంఘటనలు ఏవైనా ఉంటే తక్షణమే అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి అడ్డుకోవాలని చెప్పారు. బాల్య వివాహాలు జరగటం వలన కలిగే అనర్ధాలను వివరించారు. బంగారు బాల్యం నిర్మించుకోవాలని కోరారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పైఅవగాహన కల్పించారు. మండల విద్యాశాఖాధికారి ఎం నుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థులతో అంతర్గతంగా ఎంతో తెలివి ఉంటుందని అవగాహన వచ్చిన రోజున బహిర్గతమౌతుందని అన్నారు. అందుకు నిదర్శనం విద్యార్థులతో ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. సమయాన్ని వృథా చేసుకోకుండా చదివి పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించాలని కోరారు. డైనింగ్ హాల్, హాజరు శాతం, పరిసరాలను పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రిన్సిపాల్ సుజిత, సిబ్బంది పాల్గొన్నారు.




