స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22, 23, 24 తేదీలలో తిరుపతి జిల్లా చంద్రగిరి లో జరిగిన అండర్ 14 రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో ప్రకాశం జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైనంపాడు విద్యార్థి పి. గిరి వర్ధన్ ప్రతిభ కనపరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు,
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22, 23, 24 తేదీలలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి లో జరిగిన అండర్ 19 రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో ప్రకాశం జిల్లా హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హై స్కూల్ ప్లస్ మైనంపాడు విద్యార్థి తన్నీరు. సాయి శ్రీవాణి ప్రతిభ కనపరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు,
వీరిద్దరూ త్వరలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు డి. వి. ఎల్ నరసింహారావు తెలిపారు,
ఎంపికైన క్రీడాకారుల్ని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. కిరణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు డి. శ్రీనివాసరావు , తిరుమలశెట్టి రవికుమార్ ను ప్రత్యేకంగా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్ అభినందించారు .
ఉపాధ్యాయుడు ఓ. హనుమ చారి తదితరులు పాల్గొన్నారు.
