ఇంటి పన్నుల లక్ష్యాన్ని పూర్తి చెయ్యాలని ఎంపీడీఓ అజిత కోరారు. ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం గ్రామ కార్యదర్శుల నమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ స్వామిత్ర సభలలో పలు చోట్ల అభ్యంతరాలు వచ్చాయని, అలా కాకుండా ముందస్తుగా ప్రజాప్రతినిథులకు, అధికారులకు నమాచారం ఇచ్చి నమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఇంటి పన్నుల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి నేరుగా క్యూ ఆర్ స్కాన్ చేయించి పన్నులు వనూలు చెయ్యాలని కోరారు. మిగిలిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చెయ్యాలని కోరారు. డిప్యూటీ ఎంపీడీఓ నాగ మల్లేశ్వరి, గ్రామకార్యదర్శులు షహనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.
