జనతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ ఆధ్వర్యంలో బొద్దికూరపాడు నచివాలయంలో
శుక్రవారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. బొద్దికూరపాడు సర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి లు ముఖ్య అతిధులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. 70 మందికి కంటివైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి 20 మందికి శుక్లాలు ఉన్నట్లు తెలిపారు. వారిని తమ బస్సులో వైద్యశాలకు తరలించి ఎన్టీఆర్ వైద్య సేవలో శుక్లాల ఆపరేషన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మిగిలిన వారికి కంటి చుక్కల మందులు అందించారు. కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ మాదాల పూజిత, డీఓలు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

