దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లుఏఐసీసీ ముఖ్య కార్యదర్శి ప్రకాశం జిల్లా పరిశీలకులు నదీమ్ జావేద్ అన్నారు.
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐసీసీ ముఖ్య కార్యదర్శి ప్రకాశం జిల్లా పరిశీలకులు నదీమ్ జావేద్, ఏఐసిసి కార్యదర్శి ఏపీ ఇన్చార్జ్ గణేష్ యాదవ్ పిసిసి సమన్వయ కర్తలు డాక్టర్ రాచకొండ.జాన్ బాబు,ఏపీసీసీ కార్యదర్శి,ఏపీ ఇంచార్జి గణేష్ యాదవ్ ,రాణి మేకల సతీష్ పాల్గొన్నారు .నదీమ్ జావేద్, గణేష్ యాదవ్ లు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశ ప్రజా ప్రయోజనాల కోసం దేశ అభివృద్ధి లక్ష్యంగా, పేద ప్రజల అభ్యున్నతే ద్యేయంగా పరిపాలన చేసి,నేటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.ఐటీ సెక్టర్, బ్యాంకులు జాతీయం, రైతులకు,కూలీలకు, మహిళలకు,వృద్ధులకు, విద్యార్థులకు,అభయ హస్తoలా భరోసాతో నిలిచిన కాంగ్రెస్ పార్టీపై దొంగ వాట్లతో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ పరిపాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలో ఉందని నదీమ్ జావెద్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన మంత్రులు,ముఖ్యమంత్రులు ఎంతోమంది పరిపాలన చేసిన సంక్షేమం అందించే ఒకే నినాదంతో పరిపాలన సాగించారని,కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతి వ్యవస్థను జాతీయం చేసి ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తే, నేడు బిజెపి ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రతి వ్యవస్థను ప్రైవేట్ పరం చేస్తూ,కార్పొరేట్ శక్తులతో చేయి కలిపి, పేద ప్రజలను ఆర్థికoగా అణగతోక్కుతున్న మోడీకి నదీమ్ జావెద్, గణేష్ యాదవ్ లు మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ విషయంపై నోరు మెదపకుండా అధికార ,ప్రతిపక్షం లు బిజెపికి తొత్తులుగా ఉంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని,బిజెపి కూటమి ప్రభుత్వాలు చేస్తున్న, అరాచకాలను ఎండ
గడతామని హెచ్చరించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగo సాక్షిగా ప్రజలకు సుపరిపాలన అందించేది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి బి ఆర్ గౌస్ , దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ , కేకేసి రాష్ట్ర చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి ,జిల్లా ఎస్ సి చైర్మన్ మన్నం. ప్రసన్న రాజు, కే కే సి జనరల్ సెక్రటరీ సుదీర్ వర్మ, , రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దాసరి రవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ గోరంట్ల కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ రవూఫ్. కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

