మార్కాపురం జిల్లా ఆమోదంపై ముఖ్యమంత్రికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి
కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..
గుంటూరు, కర్నూలు మరియు నెల్లూరు జిల్లాలలోని వెనుకబడిన ప్రాంతాలతో ప్రకాశం జిల్లా ఏర్పడిందని, అధిక శాతం ప్రజలు వ్యవసాయం మరియు వ్యవసాయ కూలీ పనులపై జీవిస్తున్నారని, అన్ని రంగాలలో ఇంకా వెనుకబడేవున్నదని, ఒంగోలు జిల్లా కేంద్రం ఈ ప్రాంతాలకు ఎక్కువ దూరమై ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుచున్నారని అన్నారు. ఈ నేపద్యంలో ఈ జిల్లా ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికని, కనుక ఈ ప్రాంత అభివృద్ధికి మార్కాపురం నూతన జిల్లా ఆవశ్యకతను 2024 లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరానని తెలిపారు. దీని పై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్ ని నిర్దిష్ట సిఫార్సులు ప్రభుత్వానికి పంపమని కోరారు.
దీనిపై, మార్కాపురం సబ్ కలెక్టర్ ని కలసి నూతన జిల్లా ఆవశ్యకతకు సంబందించిన అన్ని విషయాలు తెలుపవలసినదిగా ఆ ప్రాంత నాయకులు, ప్రజలు మరియు అన్ని రంగాల వారిని కోరినాను.
ఈ ప్రాంత వెనుకబాటు తనాన్ని మరియు ప్రజల చిరకాల వాంచను గుర్తించి, గత ఎన్నికల ప్రచారంలో మార్కాపురం కేంద్రంగా జిల్లాను తప్పక ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకొని, మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లాను ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ముందుగా నారా చంద్రబాబు నాయుడుకి స్వయంగా కృతఙ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు.
మార్కాపురం జిల్లా ఆమోదంపై ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలిపిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట
28
Nov