నూతన జిల్లా ఏర్పాటు, రెవిన్యూ డివిజన్ల మార్పుపై అభ్యంతరాలు ఉంటే తెలిపాలని జిల్లా కలెక్టర్ రాజా బాబు కోరారు. అంతర జిల్లాల నిర్మాణ చట్టం 1974 ప్రకారం పలు ప్రాంతాలకు మెరుగైన పరిపాలన, అభివృద్ధి దృష్ట్యా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు మార్కాపురం లో ప్రధాన కార్యాలయంగా, కందుకూరు రెవిన్యూ డివిజన్లోని 5 మండలాలు, కనిగిరి రెవిన్యూ డివిజన్ లోని రెండు మండలాలు కందుకూరు రెవిన్యూ డివిజన్లో కలుపుతూ , కొత్తగా అద్దంకి డివిజన్ను 10 మండలాలలో ఏర్పాటు చేస్తూ, ఆయా మండలాలను ప్రకాశం జిల్లాలో కలుపుతూ 27న ప్రాధమిక ప్రకటన ఇచ్చారు. దీని ప్రకారం ప్రకాశం జిల్లా రాజ పత్రం 187, 188లు ప్రకటించారు. ఆయా ప్రతిపాదనలకు ప్రభావితమ్యే అవకావం ఉన్న జిల్లా లో నివసిస్తున్న వారు అభ్యంతరాలు, సూచనలు ఉంటే తెలిపాలని కోరారు. ఈ నోటిఫికేషన్ తేది నుండి 30 రోజుల లోపు ప్రకాశం జిల్లా, కలెక్టర్ కార్యాలయం, మొదటి అంతస్తులో అభ్యంతరాలు, సూచనలు బాక్స్
ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవైనా సూచనలు, అభ్యంతరలు ఉంటే తెలిపాలని కోరారు.
నూతన జిల్లా, రెవిన్యూ డివిజన్ల మార్పుపై అభ్యంతరాలు ఆహ్వానం
28
Nov