క్రీడా స్పూర్తితో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య అన్నారు. మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శనివారం ఆటల పోటీలు నిర్వహించి డివిజన్ స్థాయికి క్రికెట్, త్రో బాల్ పోటీలకు ఎంపికలు నిర్వహించారు. మండలంలో ఉపాధ్యాయులలో క్రికెట్కు పురుషులను, త్రో బాల్కు మహిళలను ఎంపిక చేసారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన ఉ పాధ్యాయులను డిశంబర్ 16న డివిజన్ స్థాయిలో జరుగు పోటీలకు పంపనున్నట్లు ఎంఈఓ తెలిపారు. క్రికెట్ జట్టుకు 16 మంది, త్రో బాల్ జట్టుకు 12మందిని ఎంపిక చేసారు. ఉపాధ్యాయులు ఆయా పోటీలలో ఉ త్సాహంగా విద్యార్థుల వలే చెలరేగి పోయారు. ఇదే ప్రతిభ డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చూపాలని ఎంఈఓ కోరారు. ఎంఈఓ – సుధాకర్ రావు, ఎ ఎస్పై భాస్కర్, వికే ఉన్నత పాఠశాల, తూర్పుగంగవరం ఉన్నత పాఠశాల హెచ్ ఎం లు మిల్టన్, వై ఎన్ ఆర్ కే ప్రసాద్ లు పాల్గొన్నారు.


