పశుపోషకులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. పశు సంవర్దక శాఖ ఆధ్వర్యంలో శనివారం కొప్పోలు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరం, రాయితీపై దాణా పంపిణీ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ… పశు సంపదపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. పశు పోషకుల కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఉచిత పశువైద్య శిబిరాలు, దాణా పంపిణీ చేస్తున్నామన్నారు. పాడి రైతుల కోసం గోకులం షెడ్ల నిర్మాణానికి చేయూత ఇస్తున్నామన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3కోట్ల 65లక్షల రూపాయల వ్యయంతో 150 గోకులం షెడ్లను నిర్మించినట్టు తెలిపారు. ఒంగోలు డెయిరీని మళ్లీ తెరిపించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో నిర్వహించే ఇటువంటి పశువైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎన్.వెంకటేశ్వరరావు, ఒంగోలులోని వెటర్నరీ పాలీ క్లిన్ ఉప సంచాలకులు డాక్టర్ ఎన్.జగత్ శ్రీనివాస్, ఈ.ఓ.డి.ఎల్.డి.ఓ,ఉప సంచాలకులు డాక్టర్ మురళీకృష్ణ, ఒంగోలు ఉప సంచాలకులు డాక్టర్ ఎస్.జయచంద్ర, ఆర్.ఏ.డి.డి.ఎల్., ఉప సంచాలకులు డాక్టర్ ఎం.సంధ్య, ఒంగోలు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రాచగర్ల వెంకట్రావు, ఒంగోలు టౌన్ టీడీపీ అధ్యక్షుడు బండార్ మదన్,నీటి సంఘం అధ్యక్షుడు బత్తినేని కృష్ణమూర్తి, కొప్పోలు మాజీ సర్పంచ్ కాట్రగడ్డ రఘుపతి, టీడీపీ మాజీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, కపిల్ భాషా, భాస్కర్, మీరవలి, దాసరి పేరయ్య, దొడ్డ శేఖర్, పారా రమేష్, వెంకట స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.


