రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ కాకతీయ కన్వెన్షన్ హాల్లో డి.ఆర్.డిఏ వెలుగు ఆధ్వర్యంలో మెగా రుణమేళా మరియు యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ …రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ప్రారంభించారని ఆయన చెప్పారు. మహిళలు ఆత్మ విశ్వాసంతో జీవించే విధంగా ముఖ్యమంత్రి అన్నిరకాల చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో తల్లికి వందనం, మత్స్యకార భరోసా అమలు చేశామని ఆయన చెప్పారు. అర్హత గల ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ పథకాల అమలు చేస్తామని ఆయన చెప్పారు. కొండేపి నియోజకవర్గంలో 105 కోట్ల రూపాయలమేర డిఆర్డిఏ వెలుగు ద్వారా మహిళలకు రుణాలు అందించడం జరిగిందని ఆయన చెప్పారు. కొండేపి నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారు లందరి కూడా గృహాలు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. కొండేపి నియోజక వర్గంలో 45 కోట్ల రూపాయలతో ఆర్ &బి రోడ్లను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. త్వరలో పంచాయ తీరాజ్ రోడ్లను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటా మని ఆయన చెప్పారు. కొండేపి నియోజకవర్గo అన్ని మండలాల్లో త్వరలో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. కొండపి నియోజక వర్గంలో త్రాగునీరు, సాగునీటి సమస్యలు పరిష్క రించడానికి పాలేరుకు వెలుగొండ ప్రాజెక్ట్ కాలువ అనుసంధానం చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. కొండేపి నియోజక వర్గానికి త్రాగునీరు, సాగునీరు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ నుమంత్రి కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూదేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల వద్ద 10వేల కోట్ల రూపాయలు పొదుపు నగదు ఉన్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా పొదుపు సంఘాల మహిళలు ధైర్యంగా ఉండవ చ్చునని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి ఒక వ్యాపార వేత్తను తయారు చేయాలని సంకల్పంతో పని చేస్తున్నారని ఆయన చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రతి ఒక్కరు కూడా వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆయన కోరారు. మహిళలు ఆత్మగౌరవంతో ఎదగాలనిఈ సందర్భంగాచెప్పారు. స్వయం సహాయక మహిళలు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు పొందాలని తద్వారాతమ ఖర్చులను తగ్గించు కొని పొదుపు చేసుకోవచ్చునని ఆయన సూచించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య పరీక్షలు, మందులుఅన్ని ఉచితంగా ఇస్తున్నార నిఈఅవకాశాన్ని వినియోగించు కోవాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు, సింగరాయకొండ, పొన్నలూరు మండలా లకు చెందిన స్వయం సహాయక మహిళలకు 80.35 కోట్ల రూపాయల మెగా చెక్కు ను మంత్రి అందజేశారు. టంగుటూరు, సింగరాయకొండ మండలాలకు సంబంధించిన స్వయం సహాయక సంఘాల మహిళలకు 25 కోట్ల రూపాయల మేర యూనిట్ల శాంక్షన్ లెటర్స్ ను అందజేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర మారి టైంబోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నుకసాని బాలాజీ, డి.ఆర్.డి.ఎ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ, ఒంగోలు రెవిన్యూ డివిజన్ అధికారి లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.



