కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఏ ఐ సీసీ కార్యదర్శి నదీమ్ జావిద్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమంలో భాగంగా దర్శి పట్టణంలోని పీజియన్ కాంప్లెక్స్ లో శనివారం రాత్రి దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మరియు రాష్ట్ర అసంఘటిత కార్మికుల చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. గడియార స్తంభం సెంటర్లో ముందుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాని కి పూలమాల వేసి నివాళులర్పించి, కాంగ్రెస్ జెండా ను ఆవిష్కరించారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి పిజియన్ కాంప్లెక్స్ వరకు జరిగింది. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఏఐసిసి కార్యదర్శి నదీమ్ జావిద్ మాట్లాడుతూ బిజెపి దేశంలో దుర్మార్గమైన పాలన చేస్తుందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్లో టిడిపి వైసిపి రెండు రెండేనని ఎద్దేవా చేశారు.తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని తెలిపారు. కైపు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గం వెనుకబడి ఉందని, కొత్త జిల్లాలు చేస్తున్న క్రమంలో కురిచేడు,దొనకొండ మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు కలిసి రావాలని నేను దేనికైనా త్యాగం చేస్తానని ఆమరణ దీక్ష కు సైతం వెనకాడేది లేదని కైపు స్పష్టం చేశారు. బూచేపల్లి, గొట్టిపాటి లక్ష్మి తీరుపై ఆయన విమర్శించారు. దొనకొండను పారిశ్రామిక కేంద్రంగా చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైదా, పీసీసీ అబ్జర్వర్ జాన్, సతీశ్ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, వివిధ జిల్లా నాయకులు మరియు మండలాల అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



