మాగుంట సుబ్బరామి రెడ్డి సేవలు మరువలేనివి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి – విద్యా సంస్థలు నెలకొల్పి పేదలకు విద్యను చేరువ చేసారు -తన తుది శ్వాస వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజ హితం కోసం పాటు పడ్డారు ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబానికి చెరగతి ముద్ర -ఘనంగా దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామి రెడ్డికి నివాళి

దివంగత ఎంపి మాగుంట సుబ్బ రామి రెడ్డి సేవలు మరవలేనవని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మాగుంట సుబ్బ రామి రెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా అద్దంకి బస్టాండ్లోని దివంగత ఎంపీ మాగుంట సుబ్బ రామిరెడ్డి విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, లూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ చైర్మన్ గంగాడ సుజాత లతో కలసి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పీవిఆర్ హైస్కూల్లో జరిగిన సుబ్బరామి రెడ్డి వర్ధంతి సభలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ మాగుంట సుబ్బరామన్న తుది శ్వాస వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ హితం కోసం పాటుపడ్డారని అన్నారు. ప్రజా ప్రతినిధిగా ఈ ప్రాంత అభివృద్ధికి చేసినన సేవలు మరువలేనివని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. విద్యాసంస్థలు నెలకొల్పి పేదలకు విద్యసు అందించారని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబం చెరగని ముద్ర వేసారని కొనియాడారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, నిఖిల్రెడ్డిలతో పాటు మంత్రి గొట్టిపాటి రవి కుమార్, జిల్లా కలెక్టర్ రాజా బాబు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఇంటూరు నాగేశ్వర రావు, ఏలూరి సాంబశివ రావు, దర్శి, ఎర్రగొండ పాలెం ఇన్చార్జీలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, గూడూరి ఎరిక్షన్ బాబు ఎపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం చైర్మన్ సూకసాని బాలాజీ, పలువురు జిల్లా అధికారులు, ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు.
మాగుంట కార్యాలయంలో ….
దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కార్యాలయంలో, సింగ రాయ కొండ పెరల్ డిస్టిలరీ లిమిటెట్ ఫ్యాక్టరీలో దివంగత ఎంపీ మాగుంట సుబ్బ రామి రెడ్డి చిత్ర పటానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, యువనాయుకులు మాగుంట రాఘవ రెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామక్రిష్ణ మూర్తి లు, పలువురు నాయకులు, మాగుంట అభిమానులు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నెల్లూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్డు, అద్దంకి బస్టాండ్ లలో ఉన్న దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామి రెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
స్వర్గీయ మాగుంట సుబ్బరామ రెడ్డి గారి 30 వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు భాగ్యనగర్ 4వ లైనులో స్థానిక నాయకులు ఆత్మకూరి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నివాళులర్పించారు.
కార్యక్రమంలో సుబ్బరామన్నగారి చిత్ర పటానికి పుష్పమాలంకరణ చేసి నివాళులు అర్పించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు టిడిపి యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి మరియు స్థానిక నాయకులు మరియు మాగుంట అభిమానులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *