ప్రజల సౌలభ్యం దృష్టిలో ఉంచుకొని ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కొనసాగించడం ఎంతో మంచి నిర్ణయమని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ లలిత్ సాగర్ లు నియోజకవర్గంలోని టిడిపి నేతలతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ రాజబాబు ని మర్యాదపూర్వకంగా కలుసుకొని ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి పాలన సౌలభ్యం కోసం ప్రకాశం జిల్లాలో దర్శి కొనసాగించడం దర్శి అభివృద్ధిలో ఒక మైలురాయిగా డాక్టర్ లక్ష్మీ, డాక్టర్ లలిత్ సాగర్ లు ఈ సందర్భంగా కలెక్టర్ కి వివరించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు నిధుల మంజూరు, వివిధ శాఖలో పోస్ట్లు భర్తీ తదితరాంశాలపై జిల్లా కలెక్టర్ తో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , డాక్టర్ లలిత్ సాగర్ సుదీర్ఘంగా చర్చించారు. దర్శి నియోజకవర్గంలో సోమవారం 90 శాతం పైగా పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. కార్యక్రమం లో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి -సుబ్బారావు, రాష్ట్ర నాటక రంగ సంస్థ
డైరెక్టర్ ఓబుల్ రెడ్డి, దర్శి పట్టణ టిడిపి అధ్యక్షులు చిన్నా, టిడిపి నాయకులు ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహన కార్యదర్శి మానం రమేష్, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, తెలుగు యువత కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
