విధులపట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహించిన సాంఘిక సంక్షేమ వసతి గృహము కొనకనమిట్ల సంక్షేమాధికారి శివ శంకర్ , కామాటి లక్ష్మీ దేవి ని
జిల్లాకలెక్టర్ సస్పెండ్ చేసినట్లు
సాంఘిక సంక్షేమ శాఖ, యన్. లక్ష్మా నాయక్ తెలిపారు. వివరాల్లోనికి వెళ్తే…
సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం కొనకనమిట్ల లోని విద్యార్ధులు ఆదివారం ఉదయం ఆల్ఫాహారం, మధ్యాహ్య భోజనం లేక ఆకలితో విలవిల లాడి చివరకు తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళిపోయినా సంఘటన పైన విచారణం జరపవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజా బాబు ఆదేశించారు.
విచారణం నివేదిక లో సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారి పర్యవేక్షణ లోపం వలన విద్యార్ధులకు సకాలంలో భోజనం అందించకపోవటం వలన సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారిని మరియు కామాటిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసి నట్లు తెలిపారు.
కావున జిల్లా లోని అందరూ సహాయ సాంఘిక సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులు మరియు నాల్గవ తరగతి సిబ్బంది తమ తమ విధుల పట్ల అత్యంత బాధ్యతతో వ్యవహరించి, విద్యార్థుల సంక్షేమం, భోజన ఏర్పాట్లు, పరిశుభ్రత మరియు రోజువారీ పర్యవేక్షణ విధులను సమయానికి, విధి ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించవలసినదిగా ఆదేశించుచూ మరియు విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన సందర్భంలో సంబంధితులపై కఠిన చర్యలు తీసుకొనబడునని శ్రీయుత డిప్యూటీ డైరెక్టర్ యన్.లక్ష్మా నాయక్ తెలిపారు.
విధులపట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహించిన సాంఘిక సంక్షేమ వసతి గృహము కొనకనమిట్ల సంక్షేమాధికారిని సస్పెండ్ చేసిన జిల్లాకలెక్టర్
02
Dec