బేగంపేట డిసెంబర్ 3
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రజలతో ట్రాఫిక్ సిబ్బంది సత్సంబంధాలు కొనసాగించాలని,సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవాలని ట్రాఫిక్ నార్త్ జోన్-1 ఏ సి పి జీ.శంకర్ రాజు అన్నారు. బేగంపేటలోని ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఆవరణలోని హీరో పార్క్ లో తొమ్మిది రోజుల పాటు ట్రాఫిక్ 1పోలీస్ సిబ్బందికి నిర్వహించిన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి. ఇటీవల నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రారంభించిన ‘ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం’ అనే అంశంపై ఒక రోజు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా నార్త్ జోన్ కు చెందిన 452 మంది సిబ్బందికి విడతల వారీగా 9 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలనునిర్వహించినట్లు ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు తెలిపారు. నార్త్ జోన్-1కు చెందిన ఇన్స్పెక్టర్లు, సబన్స్పెక్టర్లు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు శిక్షణా కార్యక్రమాలకు ఉత్సాహంగా హాజరయ్యారన్నారు. ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించడం, సాంకేతిక పరిజ్ఞానిన్ని వినియోగించడం, విధుల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, హైదరాబాద్ నగర ప్రాముఖ్యతను చాటిచెప్పడం, ఆర్థిక క్రమశిక్షణ అనే విభిన్న అంశాలపై శిక్షణ పూర్తి చేశామని, శిక్షణ కాలంలో ప్రతిభ చూపిన సిబ్బందికి బహుతులను ప్రదానం చేశామని ఏసీపీ తెలిపారు.


