ఒంగోలు లో వైవీ సుబ్బారెడ్డి గృహము లో బి.ఎస్. ఎన్. ఎల్ టెలిఫోన్ అడ్వైజరి కమిటీ లో మెంబర్ గా స్థానం కల్పించిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కి వైసీపీ సీనియర్ నాయకుడు దామరాజు క్రాంతికుమార్ కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇంచార్జి చుండూరి రవిబాబు ని, మార్కాపురం ఇంచార్జి అన్నా రాంబాబు ని మర్యాదపూర్వకంగా సన్మానించారు . ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ప్రస్తుతం పార్టీకి అండగా ఉండి పనిచేస్తున్న ప్రతి నాయకుడు , ప్రతి కార్యకర్తకు భవిష్యత్తు లో వైస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడని సుబ్బారెడ్డి చెప్పారు.
ఈ కార్యక్రమం లో ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్ , కె. వి రమణారెడ్డి , వై వెంకటేశ్వరావు , లంకపోతు అంజిరెడ్డి పాల్గొన్నారు.

