ఎంపీ ల్యాండ్ నిధులతో నిర్మించనున్న తాళ్లూరు శాఖా గ్రంధాలయంకు కేటాయించిన స్థలాన్ని రాజ్యసభ సభ్యులు వైవీసుబ్బారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ‘ వైసిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డిలు
గురువారం సందర్శించారు. దశాలబ్దాల కాలం క్రితం తాళ్లూరు లో శాఖా గ్రంధా లయంను ఏర్పాటు చేశారు. అప్పటి నుండి దాదాపు 50 ఏళ్లుగా గ్రంధాలయం అద్దెభ వనంలోనే కొనసాగుతున్నది. గ్రామాభివృద్ధికిపాటు పడుతున్న తాళ్లూరు కు చెందిన ఐ.సీ.కోటి రెడ్డి గ్రామంలో ఏడున్నర సెంట్ల స్థలాన్ని సమకూర్చి గ్రంధాయం పేరున రిజిష్టర్ చేయించారు. స్థలం వున్నా పక్కాభవనం నిర్మాణం కోసం కృషి చేసిన వారు లేరు. ఐ.సీకోటిరెడ్డి కుమారుడు ఐ. వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి గ్రంథాయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డిని కోరారు. ఎంపీ వై. వీ అత్యధికంగా గ్రంధాలయ భవనం కోసం ఎంపీలాడ్స్ నుండి 35 లక్షలు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ కు పంపారు. ఎంపీ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ అడ్మిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. తాళ్లూరు లో ఐ వి రెడ్డి కుమార్తె చరిష్మా వివాహ రిసెప్షన్ కు వచ్చిన సందర్బంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు ఆస్థలాన్ని పరిశీలించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే నిర్మాణపనులు పూర్తి చేసిఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తాళ్లూరు శాఖా గ్రంధాలయ భవనం వినియోగంలోకి వస్తుందన్నారు. ఈకార్యక్రమంలో వారి వెంకట వైవీ భద్రారెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎల్ . జి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐ.వి.సుబ్బారెడ్డి, అశోక్ రెడ్డి, క్రిష్ణారెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు.

