విద్యార్థుల అభ్యున్నతికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. తాళ్లూరు మండలం లో శుక్రవారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. తాళ్లూరు కస్తూరిబా పాఠశాలలో జడ్పిటిసి మారం వెంకట రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండల ప్రత్యేక అధికారి ఏ కుమార్, ఎంపీడీవో అజిత, ఎంఈఓ జి సుబ్బయ్య , ప్రిన్సిపల్ సుజిత లు పాల్గొని విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహించారు. తహసిల్దార్ రమణారావు, ఎంఈఓ 2 సుధాకరరావు , హనుమంతరావు , వ్యవసాయ అధికారి ప్రసాదరావు, ఏపీఎం దేవరాజ్, ఏపీవో వెంకటేశ్వర్లు లు ఆయా పాఠశాలకు ప్రత్యేక అధికారులుగా నియమితులై సమావేశం విజయవంతానికి కృషి చేశారు. విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల ప్రత్యేక సూచనలను కోరారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.



