ప్రజల సమస్యలు పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ఈ ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించామన్నారు.
మండల కేంద్రమైన తాళ్లూరులో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ,టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ…
ప్రజల సమస్యలు పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ఈ ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు ఈ ప్రజాదర్భార్ లో పాల్గొని ప్రజల నుండి మండలం లోని అన్ని శాఖలకు కలిపి దాదాపు 225 వినతులను స్వీకరించటం జరిగిందని వివరించారు. ప్రజా దర్బార్ లో ప్రజలనుండి పలు సమస్యలపై వినతులకు సంబందించి తక్షణం పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ముఖ్యంగా రెవిన్యూ, పెన్షన్లు, ఇళ్ల, స్థలాలు, విద్యుత్ సమస్యలు తదితర భూ వివాదాలపై వినతి పత్రాలు స్వీకరించటం జరిగిందని అన్నారు. అధికారులు అప్రమత్తతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కార్యాలయం చుట్టూ తిప్పకుండా వచ్చే ప్రజా దర్బార్ నాటికి పరిష్కారం చేయాల్సిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖ మంత్రి
నారా లోకేష్ బాబు ప్రజల అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ప్రజాదర్భార్ లలో పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని అదే స్ఫూర్తితో మనం కూడా సమస్యలను పరిష్కరించాలని కోరారు. కూటమిప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలల్లో ప్రజల సమస్యల పరిష్కారమే శ్రేయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. తాళ్లూరులో ప్రధానంగా మొగిలిగుండం రిజర్వాయర్ ను పూర్తి చేసి రైతులకు అందించటం జరుగుతుందని కూటమి ప్రభుత్వం రైతులకు అందించిన వరం గా చెప్పవచ్చు. అదేవిధంగా లోఓల్టేజి సమస్య పరిష్కారానికి 133 కెవి సబ్ స్టేషన్ కూడా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పనకు రోడ్లు డ్రైన్లు గ్రామాలలో సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సాగునీటి సమస్యపై రైతుల నుండి కొన్ని వినతులు తీసుకొని వాటిపై కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందని ఆమె వివరించారు. ప్రజలు అవసరాలు తీర్చే ప్రభుత్వంగా ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్న మన కూటమి ప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలని, అభిమానించాలని, దీవించాలని డాక్టర్ లక్ష్మీ కోరారు.
ఈ కార్యక్రమం లో మండల తహసీల్దార్ బి. వి రమణారావు
, ఎంపీడీఓ పి.అజిత మరియు విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, హోసింగ్ మండలం లోని అన్ని శాఖల అధికారులు, మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ యిడమకంటి వెంకటేశ్వర రెడ్డి,రాష్ట్ర నాటక రంగ కళాపరిషత్ డైరెక్టర్ బి.ఓబుల్ రెడ్డి, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, సాగర్ ,
యిడమకంటి శ్రీనివాసరెడ్డి, నీటి డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ టి శివ నాగిరెడ్డి ,సొసైటీ అధ్యక్షులు సమరా, సుబ్బయ్య, కైపు రామకోటిరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ వెంకట్రావు,నాగార్జునరెడ్డి,యూనిట్ & బూత్ ఇంచార్జలు, ప్రజలు పాల్గొన్నారు.








