బేగంపేట డిసెంబర్ 7
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట ఫ్లై ఓవర్ పై నుంచి వాహనాలు కిందికి దిగుతున్న ప్రాంతంలో ప్రతిరోజూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ సంఘటనపై పత్రికలో కథనాలు ప్రచురితమవడంతో స్పందించిన అధికారులు ఫ్లై ఓవర్ దిగే ప్రాంతం లో శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి ఆలయం ఎదురుగా వన్ వే బోర్డు ను ఏర్పాటు చేశారు.అయితే ఈ బోర్డు ఫ్లై ఓవర్ నుంచి కిందికి దిగుతున్న వాహన దారులకు కనిపించడం లేదు.ఒక వైపు మాత్రమే వన్ వే అని రాసి ఉండటం తో పంజాగుట్ట వైపు నుంచి వచ్చే వాహనదారులు బ్రిడ్జి కిందవున్న బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ,వడ్డెర బస్తీ,మాతాజీ నగర్ ,బ్రాహ్మణవాడి తదితర బస్తీలకు చెందిన వారు వన్ వే మార్గం లో వెళుతుండటం తో వారి వాహనాలకు చలాన్ లు వస్తున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు.బోర్డు కనిపించకుండా ఏర్పాటు చేయడం తో ఈ సమస్య తలెత్తుతుందని బస్తీ వాసులు వాపోతున్నారు.ఇప్పటి కైనా ట్రాఫిక్ అధికారులు స్పందించి వన్ వే బోర్డు ను శ్రీ కట్ట మైసమ్మ ఆలయం ముందు ఏర్పాటు చేస్తే ఫ్లై ఓవర్ దిగిన వాహన దారులకు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది.ఆదిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు ,వాహనదారులు కోరుతున్నారు.
