హైదరాబాద్ డిసెంబర్ 7(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఉప్పల్ స్టేడియం లో ఈ నెల 13న జరగ నున్న మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్లను ఆదివారం తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు,ఐ టి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఖైరతాబాద్ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పరిశీలించారు. మ్యాచ్ ను చూసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు .


