జిల్లాలో ప్రసిద్ది చెందిన గుంటి గంగాభవాని అమ్మవారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. పూజారు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాలరాజు, విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులకు ఆశ్వీర్వాదం అందించారు. ఈఓ వాసు బాబు, ఆర్ ఏ ప్రసాద్ భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించారు.
శ్రీగుంటి గంగాభవానీ ఆలయట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల….
జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శ్రీగుంటి గంగాభవానీ ఆలయట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆలయ ఈవో వాసుబాబు ఆదివారం తెలిపారు. జిల్లా దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాను సారం శ్రీగుంటి గంగాభవానీ ఆలయట్రస్ట్ బోర్డు నియామకం చేపట్టేందుకు ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపా రు.ఏపీ దార్మిక పరిషత్ ద్వారాట్రస్ట్ బో ర్డు నియామకం జరుగుతుందన్నారు.ఆసక్తి గలవారు ధరఖాస్తులను20 రోజులోపు ఏపీ దార్మిక పరిషత్కు అంజేయాలన్నా రు.అన్ని గ్రామాలపంచాయతీలవద్ద, తహసీల్దార్ కార్యాలయం వద్ద నోటీస్-బోర్డులను అందుబాటులో వుంచినట్లు తెలిపారు.
