ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటూ ఆ వసరమైన మట్టిని పట్టా భూముల్లో ట్రాక్టర్లలో తోలుకుంటుండగా ఏఎన్ఆర్ నిర్వహకులు అడ్డుకోవటంపై తూర్పుగంగవరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లకు మట్టి తోలకాన్ని అడ్డుకోవటంపై నాగంబొట్లపాలెం సొసైటీ అధ్యక్షులు వల్లభనేని సుబ్బయ్య, మరి కొందరు రైతులు. తహసీల్దార్ బి.వి.రమణారావుకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ రమ ణారావు బుధవారం పట్టా భూములను పరిశీలించారు. పూర్వం నుండి గ్రామానికి సమీపాన గల ఉమ్మడి పట్టాభూమి (తిప్పబీడు) నుండిగ్రామాల్లో ఇళ్ల నిర్మాణంసమయంలో మట్టి తొలుకుంటారన్నారు. ఎంతో కాలంగా తోలుకుంటుండగా ఏఎన్ఆర్ ఏజన్సీ వారు తాము చెక్ పోస్టు ఏర్పాటు చేశామని మట్టి ట్రాక్టర్ కు 700 చలానా చెల్లించి మాత్రమే మట్టి తీసుక వెళ్లాలని అంటున్నారని తెలిపారు. పట్టాభూమిని నుండి ఏఎన్ఆర్ నిర్వహకులు ఏర్పాటు చేసుకున్న చెక్ పోస్టుకు దాదాపు 5కిలో మీటర్ల దూరంలో వుందని, గ్రామంలో ఇళ్లలకు ట్రాక్టర్లలలో మట్టి తోలుకుంటే
సబంధం లేకున్నా ట్రాక్టర్ యజమానులను భయపించి మట్టి తొవ్వకాన్ని నిలుపుదల చేశారన్నారు. సొంతభూమిల్లో నుండి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించే స్థోమత తమకు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.
గ్రామస్తులఫిర్యాదు మేరకు తహసీల్దార్ తిప్పభీడును పరిశీలించారు. మట్టి త్రవ్వకాన్ని నిలుపుదల చేసిన చెక్ పోస్టు నిర్వహకుల వద్దకు వెళ్లి మేనేజర్ తో
తహసీల్దార్ ఫోన్లో మాట్లా డారు. నింబంధనల బైలాను తీసుకుని గురువారం కార్యాలయానికి రావాలని కోరారు. ఇంటి నిర్మాణాలకు కోసం పట్టా భూములనుండి మట్టిని తోలుకుంటే చలానా వేయటం ఏమిటని, అన్నివివరాలు తీసుకుని కార్యాలయానికి రావాలన్నారు. ఆయన వెంట మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, నాగంబొట్ల పాలెం సొసైటీ అధ్యక్షులు వల్లభనేని సుబ్బ య్య, సోమా ఆంజనేయులు విఆర్వో ఎం.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
