విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పూర్వ విద్యార్థులు పలు పోటీలు నిర్వహించేందుకు ముందుకు రావడం అభినంద నీయమని ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు హైస్కూల్ కు చెందిన 2000-01 పూర్వ విద్యార్థులు పలు పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పోస్టర్ ను శుక్రవారం విజయవాడ ఆర్టీసీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా
డుతూ పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి కృ షి చేయడం అభినందనీయమన్నారు. పూర్వ విద్యా ర్థి సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గంగవరపు శ్రీనివాస రెడ్డి , మలేశ్వర రావు లు మాట్లాడుతూ సంక్రాంతి నేపథ్యంలో జనవరి 6వ తేదీ నుంచి దర్శి, తాళ్లూరు మండలాల లో ని గవర్నమెంట్ హై స్కూల్ ల కు చెందిన విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో ముఖ్యంగా కథలు చెప్పడం, గ్రామీణ సంక్రాంతిపై చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్ పోటీలు ఉంటాయని చెప్పారు. పోటీల్లో విద్యార్థులు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆ పాఠశాల రిటైర్డ్ హెడ్మాస్టర్ ఎస్. అంజిరెడ్డి కోరారు.
