దొనకొండ మండలం రామాపురం గ్రామంలోని గొంగటి.వెంకట సుబ్బమ్మ 40 మంది(రక్త సంబధీకులు) కుటుంబ సభ్యులను కలిగి, ఐదు తరాల ముని మనవరాళ్లు,మనవల్లతో ఈనాటికీ ఎవరి సహాయం లేకుండా ఆమె పనులు ఆమేచేసుకుంటూ ఈనాటి మానవాళికి మంచి ఆదర్శంగా,దిక్చూసిలాగా అందరి మన్ననలు పొందుతుంది.
ప్రపంచ మహమ్మారి కరోనా విశ్వమానవాళినే కకావికళం చేసి,ధనిక పేదరికం అనే భేదం లేకుండా ధిగ్గజాలను, యువకులను సైతం కబళించిన కరోనా ఆమెకు ఎలాంటి ప్రభావాన్ని చూపలేదని ఆమె స్వయంగా చెప్తుంది.ఈ కలియుగ,కంప్యూటర్ యుగంలో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే యువత జీవనమనుగడే ప్రశ్నార్ధకమైన ఈరోజుల్లో యువతకు శారీరక వ్యాయామం లేకపోవడం,అధిక మానసిక వొత్తిడికి గురికావడం,చిన్నతనంలోనే సరైన ఆహారం తీసుకోకుండా శారీరక, మానసిక రుగ్మతలకు గురై అనేకమంది యువత చిన్న వయసులోనే మరణిస్తున్నారని,పల్లెటూరులో వాతావరణం ఎలాంటి కలుషితం లేకుండా వుంటుందని, నగర,పట్టణ ప్రాంతాలలో తాగే నీటినుండి పీల్చేగాలి వరకు డబ్బుతో కొనాలని, మనం తినే ఆహార పదార్థాలు శుభ్రత కంటే రుచులకోసం నాణ్యత చూడకుండా నిండుజీవితాలను ఫణంగా పెడుతున్నారని, పట్టణాలకంటే పల్లెల ప్రజలు ఎక్కువ కాలం ఎలాంటి రుగ్మతలు లేకుండా ఎక్కువ కాలం జీవిస్తున్నారని,నేనిప్పటివరకు ఆరోగ్యంగావుంటూ నాపని నేనుచేసుకోవడానికి ప్రధానంగా పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం,ఆహారపు అలవాట్లే కారమని ఆమె మాటల్లో చెబుతుంది.
40 మంది రక్తసంబంధీకులతో కలిసిమెలసి ఉండటం దేవుడి వరంగా భావిస్తున్నానని, “ఇక ఈ జీవితం చాలు” త్వరగా తీసుకొనివెళ్ళు స్వామి” అని దేవుణ్ణి మనసార వేడుకున్నా తీసుకెల్లడం లేదని ఆ కురువృధ్ధురాలు గొంగటి.వెంకట సుబ్బమ్మ ఈ వయసులోకూడా సరదాగా, సంతోషంగా మాట్లాడుతుంది. ఇలాంటివారు విశ్వమానవాళికీ ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది.

