విద్యార్థుల సృజనాత్మకత గోపాల క్రిష్ణ అన్నారు. ఒంగోలు ప్రశంశనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ సెంట్రల్ సాయిబాబ స్కూల్లో శుక్రవారం జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి సీ వి రేణుక అధ్యక్షతన సభను నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ. నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడతూ స్థానిక సమస్యలను స్థానికంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. సైన్స్ పట్ల ఆసక్తి చిన నాటి నుండి అభివృద్ధి చేసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు. నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యతో పాటు మానసిక శారీరక వికాసం అన్ని రంగాలలో ముందుకు వెళ్లే విధంగా ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారి సీవి రేణుక మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచిని పెంపొందించు కొని శాస్త్రీయ దృక్పదంతో ప్రాజెక్టులు తయారు చేసి రాష్ట్ర స్థాయికి ఎక్కువ ప్రాజెక్టులు సెలెక్ట్ అయ్యే విధంగా కృషి చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు, మార్కాపురం ఉప విద్యాశాఖాధికారులు ఎ చంద్రమౌళీశ్వర రావు, ఎం శ్రీనివాసులు, డీసీఈబి సెక్రటరీ ఎం శ్రీనివాసరావు . జిల్లా సైన్స్ అధికారి టి రమేష్ ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబు, తహసీల్దార్ మధు, పలు మండలాల ఎంఈఓ లు , సైన్స్ ఉపాధ్యాయులు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.




