హైదరాబాద్ డిసెంబర్ 21
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఖైరతాబాద్‌లోని లెమెన్స్ ఎవాంజెలికల్ ఫెలోషిప్ (ఎల్ఈఎఫ్) చర్చిలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం వేడుకలు “జాయ్ టు ద వరల్డ్” గీతంతో చర్చి సమూహం గీతాలాపనతో వేడుకలు ప్రారంభం అయ్యాయి. అనంతరం క్రీస్తు పుట్టుకపై ఆంగ్లంలో చిన్నారులు, హిందీలో ప్రాథమిక విద్యార్థులు, జూనియర్, సీనియర్ విద్యార్థులు ప్రత్యేక అలంకరణలో చేరుకుని గీతాలు ఆలపించారు. యువతులు, మహిళలు వేర్వేరుగా గీతాలు ఆలపించారు. క్రీస్తు జననంపై ప్రదర్శించిన నాటిక ఎంతో ఆకట్టుకుంది. అనంతరం చిన్నారులు వెలిగించిన కొవ్వొత్తులు పట్టుకుని చర్చిలో నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ బ్రదర్ అబ్రహాం ప్రార్థన చేయగా విజయవాడ నుంచి అతిథిగా హాజరైన దైవ సేవకుడుబ్రదర్ ప్రియనాథ్ క్రీస్తు జననంపై బైబిల్ లోని అంశాలను ఎత్తిచూపుతూ వాఖ్యోపదేశం చేశారు.
యేసు క్రీస్తు నడిచిన మార్గంలో ఆయన విశ్వాసులుగా మనమూ నడవాలని సూచించారు. వేడుకలో నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి వందలాదిగా పాల్గొన్నారు.




