సెక్యూరిటీ గార్డ్ అలేఖ్య పై కుల వివక్షతోనే కత్తి తో దాడి జరిగింది.. అలేఖ్య పై హత్యాయత్నం చేసిన భాష, అతను కుటుంబ సభ్యులపై హత్యాయత్నం కేసుతోపాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి -బాధితుల చెప్పిన ఫిర్యాదును మార్చి వ్రాస్తున్న ఔట్ పోస్ట్ కానిస్టేబుల్ ఏడుకొండలును సస్పెండ్ చేయాలి–సుజన్ మాదిగ

ఒంగోలు రిమ్స్ వైద్యశాల సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న అలేఖ్య పై, రిమ్స్ వైద్యశాలలోనే డ్యూటీలో ఉండగా భర్త భాష, ఆమె తల్లి సహకారంతో కులం పేరుతో దూషించి కత్తితో విచక్షణ రహితంగా పొడిచి, చంపేందుకు ప్రయత్నించిన భాష మరియు అతని కుటుంబ సభ్యులపై హత్యాయత్నం కేసుతో పాటుగా ఎస్సీ ఎస్టీ కేసుగా నమోదు చేయాలని,మాదిగ సంక్షేమ పోరాట సమితి అధ్యక్షులు కొమ్మ సుజన్ మాదిగ,దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంగళరావు సంయుక్తంగా డిమాండ్ చేశారు. సోమవారం ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో ఆదివారం కత్తిపోట్లకు గురై గాయాలతో చికిత్స పొందుతున్న, సెక్యూరిటీ గార్డ్ అలేఖ్యని వారు పరామర్శించారు. వివరాల్లోకెళ్తే అలేఖ్య ఎస్సీ కులం కు చెందిన యువతీ, ముస్లిం కులానికి చెందిన భాషను ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన నాటి నుండి భాషా అతని తల్లి, కుటుంబ సభ్యులు అలేఖ్య ఎస్సీ కులము కావడంతో దీనిని జీర్ణించుకోలేక వారు ఆమెను గృహహింస పెడుతూనే ఉన్నారు. కుల వివక్షతోనే వారు చేస్తున్న పాశవిక దాడి తీవ్ర రూపం దాల్చి,ఆమెను అంతమొందించాలని కుట్రతో ఆదివారం ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో, సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ నిర్వహిస్తున్న అలేఖ్య ను చంపేందుకు పథకం పన్ని తల్లిని వెంటబెట్టుకొని, భాష వైద్యశాలకు చేరుకొని మధ్యాహ్నం సమయంలో విధులు నిర్వహిస్తున్న రూమ్ లో, బయట తల్లిని కాపలఉంచి, భాష అలేఖ్య పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేందుకు పాల్పడ్డాడు. ఆ సమయంలో కులం పేరుతో దూషణకు పాల్పడ్డారు. ఘటన సమాచారాన్ని అక్కడ ఉన్న సిబ్బంది గమనించి, ఒంగోలు రిమ్స్ వైద్యశాల ఔట్ పోస్టులో పోలీసు విధులు నిర్వహిస్తున్న ఏడుకొండలు కు సమాచారం ఇచ్చి, బాధిత మహిళ చేత జరిగిన సంఘటనపై ఫిర్యాదు వ్రాయించి, వైద్యాన్ని అందించారు. కానిస్టేబుల్ ఏడుకొండలు అలేఖ్య వ్రాసిన ఫిర్యాదును బుట్ట దాఖలు చేసి, వేరొక ఫిర్యాదు తనే తయారుచేసి, బాధిత మహిళచేత సంతకం పెట్టించుకున్నారని, ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని,ఇటువంటి సంఘటనలు ఒంగోలు రిమ్స్ వైద్యశాలలోని పోలీస్ అవుట్ పోస్టులో ప్రతినిత్యం జరుగుతున్నాయని, సుజన్ మాదిగ ,వెంగళరావులు ఆరోపించారు. వివిధ రకాలుగా కులవేధింపులుకు బాధింపబడి, దాడి జరపబడి గాయాలతో ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు దళితులు వస్తే ఆ బాధితులు చెప్పిన ఫిర్యాదును తీసుకోకుండా, మార్చివ్రాయటం అలవాటుగా చేసుకున్న డ్యూటీలో ఉన్న ఏడుకొండలు కానిస్టేబుల్ ను విధులు నుండి సస్పెండ్ చేయాలని, వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ కుమార్ రాజుని కలిసి అలేఖ్య పై జరిగిన దాడి ఘటన మరియు ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో ఉన్న పోలీస్ అవుట్ పోస్టులో జరుగుతున్న సంఘటనలపై ఫిర్యాదు చేస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల కేక నాయకులు శ్రీనివాసరావు, పైనo మధు, ఎమ్మెస్పీఎస్ నాయకులు తేళ్ల జయరాజు, రవి, కవిల బుల్లియ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *