హైదరాబాద్ డిసెంబర్ 23 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
సిపిఆర్ పై అవగాహన ఉంటే ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించవచ్చని టీజీ ఎస్ పి ఎఫ్ కమాండెంట్ సి జంగయ్య అన్నారు. మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో సిబ్బందికి సిపిఆర్, బిఎల్ఎస్ పై అవగాహన కల్పించారు. అమీర్పేట్ హాస్టల్ ప్రైమ్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో వారు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జంగయ్య తెలియజేశారు.ఈ సందర్భంగా కమాండెంట్ జంగయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ బేగంపేట విమానాశ్రయం తో పాటు రిజర్వ్ బ్యాంక్ తదితర ప్రాంతాల్లో సిబ్బందికి సిపిఆర్ పై అవగాహన కల్పించామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సిపిఆర్ బిఎల్ఎస్ ఎలా చేయాలన్న విషయాన్ని ఆస్టర్ ప్రైమ్ వైద్యులు సిపిఆర్ చేసి వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ బి రంజిత్ కాసో ,ఇన్స్పెక్టర్ డి. మహేందర్ సబ్ ఇన్స్పెక్టర్లు మల్లేష్ ,బి వి జి రాజు, బి.కృష్ణారెడ్డి ,జి శ్రీనివాసరెడ్డి, ఏవి రమణ సిబ్బంది పాల్గొన్నారు.
