సాంకేతికతో రైతన్నలు ముందుకు సాగి మరిన్ని మంచి ఫలితాలు సాధించాలని వక్తలు ఆకాంక్షించారు. తాళ్లూరు మండల వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద వ్యవసాయాధికారి ప్రసాద రావు ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. ఎంపీడీఓ అజిత, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, మానం రమేష్, శ్రీనివాస రెడ్డి, వేణులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. నేలను దైవంగా భావించి పంటను ప్రాణంగా ప్రేమించి సేద్యాన్ని చేస్తూ చెమటను ఎరువుగా మార్చి అందరి ఆకలిని తీర్చే వాడు రైతన్న అని అటువంటి రైతన్నకు మంచి జరగాలని వక్తలు ఆకాంక్షించారు. పాడి పంటలతో మండలంలో నిత్య కృషి వళీళుగా వర్ధిల్లు తున్న రైతన్నలకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
