గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావును మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా మాణిక్యరావుకు రాష్ట్ర మాదిగ సంక్షేమ పోరాట సమితి తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పార్టీ కార్యాలయంలో వ్యవస్థాపక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందమూరి ఎన్టీ రామారావు విగ్రహం ఎదుట పిల్లి మాణిక్యరావు చేత కేక్ కట్ చేయించి ఆయనకు పూల బొకే అందజేసిశాలువా కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాదిగలకు రాజకీయంగా గుర్తింపు కల్పిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేతమరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము సుజన్ మాదిగ మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో సుదీర్ఘ కాలంగా పనిచేసి తెలుగుదేశం పార్టీలో చేరి అంచేలంచెలుగా పదవులు పొందుతూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించడం పట్ల పిల్లి మాణిక్యరావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి నగరం కూడా గుంటూరు జిల్లాలోనే ఉందని అంత పెద్ద రాజకీయప్రాముఖ్యత కలిగిన జిల్లాలో అధికార పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా కల్పించడం సంతోషకరమన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయడంతోపాటు ఎస్సీ ఉద్యోగులలో కూడా పదోన్నతుల్లో ఉప వర్గీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని అభినందిస్తున్నామని సుజన్ తెలియజేశారు. అదేవిధంగా ఎస్సీలకు అందజేయాల్సి ఉన్న సంక్షేమ పథకాలు ఏడాది చివరిలోపైన ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోపైన బ్యాంకు లింకేజీ రుణాలు ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా సత్వరమే ఎస్సీ నిరుద్యోగ యువతి యువకులకు అందజేయాలని ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసు
మని మాణిక్యరావు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి ఎస్ ప్రతినిధులు గద్దె త్యాగరాజు ,కొలకలూరి విజయ్ కుమార్, డొక్కా శ్రీనివాసరావు తేళ్ల జయరాజ్ బండారు సురేష్, పొగడ్త నారాయణ తదితరులు పాల్గొన్నారు.
