ప్రకాశం జిల్లా దొనకొండ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ 2025 నవంబర్ 11 న అనారోగ్యంతో మరణించిన కీర్తి శేషులు హెడ్ కానిస్టేబుల్ నంద్యాల శ్రీనివాసులు భార్య రాధకి బ్యాంకు అఫ్ బరోడా పోలీస్ శాలరీ ప్యాకేజీ పధకం కింద అందించిన రూ.15,00,000/- చెక్కును మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అందచేసినారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారి కుటుంబం యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమని, మీరంతా పోలీస్ శాఖలో భాగమని, వారికి ప్రభుత్వం నుండి అందవలసిన ఇతర అన్ని బెనిఫిట్స్ లను త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం అందజేసిన ఆర్థిక సహాయం ద్వారా కుటుంబానికి కొంత భరోసా కలుగుతుందనే ఆశిస్తున్నామన్నారు. ఏదైనా సమస్య ఉన్న నేరుగా తనను కలవవచ్చని, పోలీసు శాఖ వారికి అండగా నిలుస్తుందని ఎస్పీ వారికి భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐ రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎమ్. ఎస్. ఎం. ఈ
బ్రాంచ్, ఒంగోలు, బ్యాంకు అఫ్ బరోడా మేనేజర్ వికాస్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
