హైదరాబాద్ డిసెంబర్ 24
(జే ఎస్ డి ఎం న్యూస్ )
తెలంగాణ రాష్ట్రం బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ,ముఖ్యంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అసలైన అభివృద్ధి జరిగిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం బేగంపేట డివిజన్ ఓల్డ్ కష్టమ్ బస్తీలో ఒక కోటి 67 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సి సి రోడ్లు, స్ట్రామ్ వాటర్ లైన్ పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అధికారులతో కలిసి బస్తీ మొత్తం తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బస్తీలో ని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని బస్తీ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. బస్తీ గుండా వెళ్తున్న నాలాలో వ్యర్ధాలను చూసి వెంటనే పూడిక తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఖబరస్థాన్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించిఅడిగితెలుసుకున్నారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. బస్తీలో ని పలు చోట్ల రోడ్లు సక్రమంగా లేకపోవడం, స్ట్రామ్ లైన్ లేకపోవడం తో ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకు రాగా రోడ్ల నిర్మాణం, స్ట్రామ్ వాటర్ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ గతంలోని నాయకులు ఓల్డ్ కష్టమ్ బస్తీని కేవలంఓట్లకోసమేవాడుకున్నారని, బస్తీలో ని సమస్యలను విస్మరించారని విమర్శించారు. సనత్ నగర్ నియోజకవర్గం లో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే జరిగాయని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీ లైన్ ల సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో బ్రాహ్మణ వాడి, వడ్డెర బస్తీ వరద ముంపుకు గురై ప్రజలు అనేక అవస్థలు పడ్డారని, తాను వచ్చిన తర్వాత 45 కోట్ల రూపాయల వ్యయంతో నాలా కు రిటైనింగ్ వాల్ నిర్మాణం, డ్రైనేజీ లైన్ ల ఏర్పాటు తో సమస్యను పరిష్కరించగలిగామని వివరించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఫతే నగర్ ఫ్లై ఓవర్ విస్తరణ, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణం కోసం 100 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి శంఖుస్థాపన చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులను రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలను తెలుసుకొని దశల వారిగా సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ టి. మహేశ్వరి, DC డాకు నాయక్, ఈ ఈ సుబ్రమణ్యం, వాటర్ వర్క్స్ జి ఎం వినోద్, డి జి ఎం ఆశిష్, స్ట్రీట్ లైట్ డి ఈ అనిత, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్ ఆరీఫ్, శేఖర్, నాగరాజు, అఖిల్, బస్తీ వాసులు అబ్బాస్, వాహిద్, సాబేర్, మోహిన్ తదితరులు ఉన్నారు.





