కరుణామయుడు, లోక రక్షకుడు ఏసుప్రభువు జన్మించిన పర్వదినం క్రిస్మస్ వేడుకలను జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆనందంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులందరికీ జిల్లా కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, దయ, ప్రేమ, ధర్మం, న్యాయం, అహింస, పరోపకారం వంటి ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని, క్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
