మరియ తనయుడు ఏసు క్రీస్తు జన్మించిన క్రీస్మస్ పర్వదినాన్ని గురువారం జిల్లాలోని క్రైస్తవులు భక్తి శ్రర్థలతో జరుపుకున్నారు. చర్చిలలో ఫాస్టర్లు దైవ సందేశాన్ని వినిపించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున చర్చిలకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసారు. స్తుతి గీతాలను ఆలపించారు. చిన్నారులు క్రీస్తు జనన ఘట్టాల దృశ్య రూపాలను ప్రదర్శించారు. క్రిస్మస్ కేక్లు కట్ చేసారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఒంగోలు జువెట్ మెమోరియల్ లో క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న ఒంగోలు, బాపట్ల ఎంపీలు మాగుంట , శ్రీ క్రిష్ణ ప్రసాద్
ప్రభువు ఏసు క్రీస్తు లోక రక్షకుడని పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారని పలువురు ఫాస్టర్లు అగస్టీన్, ఆశీర్ పాల్, కెనడీలు సందేశం అందించారు. జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుక సందర్బంగా నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో ఒంగోలు, బాపట్ల ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, క్రిష్ణ ప్రసాద్లు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో చర్చిలు అన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ట్రంక్ రోడ్ లో చర్చి సెంటర్ వద్ద నుండి దక్షణ బైపాస్ రోడ్ పొగాకు బోర్డు ఆర్ ఎం కార్యాలయం వరకు డివైడర్లు విద్యుత్ దీపాలతో అలకంరించటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




